కోహ్లీ మరోసారి కెప్టెన్సీ చేపడతాడని అనుకోవడంలేదు: చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ

  • ఇంగ్లండ్ తో టెస్టు ఆడనున్న టీమిండియా
  • కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా
  • జులై 1 నుంచి టెస్టు
  • అప్పట్లోగా రోహిత్ కోలుకోవడంపై అనిశ్చితి
  • కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారిన వైనం
జులై 1న ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా, కరోనా బారినపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ అప్పటికల్లా ఆరోగ్యం సంతరించుకుంటాడా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ రోహిత్ శర్మ అప్పటికి కోలుకోకపోతే, అతడి స్థానంలో ఎవరు కెప్టెన్సీ వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించారు. బర్మింగ్ హామ్ టెస్టులో కోహ్లీ నాయకత్వం వహించబోడని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ గైర్హాజరైతే కోహ్లీ జట్టు పగ్గాలు స్వీకరిస్తాడని తాను అనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. 

రోహిత్ శర్మ స్థానంలో ఎవరిని కెప్టెన్ గా నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారో తాను అంచనా వేయలేనని తెలిపారు. "గతంలో కోహ్లీ కెప్టెన్సీ నుంచి తానే స్వయంగా తప్పుకున్నాడు. అతడినెవరూ తప్పించలేదు, వేటు వేయలేదు. అందుకే మరోసారి కెప్టెన్సీ చేపట్టడానికి కోహ్లీ ముందుకు రాకపోవచ్చు" అని రాజ్ కుమార్ శర్మ వివరించారు. జట్టు కోసం సర్వశక్తులు ధారపోస్తాడని ఆయన తన శిష్యుడు కోహ్లీని ప్రశంసించారు.


More Telugu News