నా అనుభవమే నా అర్హత: ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా సమాధానం
- హిమాచల్ ప్రదేశ్ బాలిక ఫొటో వైరల్
- ఆ బాలిక తన ప్రేరణ అని పేర్కొన్న ఆనంద్
- మీ క్వాలిఫికేషన్ ఏంటని ప్రశ్నించిన ఓ నెటిజన్
- ఆసక్తికరంగా బదులిచ్చిన ఆనంద్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకపోయినా, ఆసక్తికరంగా బదులిచ్చారు. సర్... మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటూ వైభవ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. అందుకు ఆనంద్ మహీంద్రా స్పందించారు.
"నిజం చెప్పాలంటే... నేనిప్పుడున్న వయసులో ఏ యోగ్యతకైనా అనుభవం మాత్రమే అర్హత" అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా సమాధానం అనేకమంది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో, ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అసలు ఈ చర్చకు కారణం ఓ బాలిక ఫొటో. హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతంలో ఓ గుట్టపై కూర్చుని చదువుకుంటున్న ఆ బాలిక ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభిషేక్ దూబే అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు.
దానిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ఈ ఫొటో ఎంతో బాగుందని, ఆ బాలికను తాను ప్రేరణగా తీసుకుంటానని వెల్లడించారు. ఈ క్రమంలోనే వైభవ్ అనే నెటిజన్ ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు.