'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- అల్లరి నరేశ్ నుంచి మరో విభిన్న కథాచిత్రం
- మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ
- కెరియర్ పరంగా ఇది ఆయనకి 59వ సినిమా
- 60వ సినిమా 'నాంది' దర్శకుడితో
ఈ మధ్యకాలంలో టైటిల్ ద్వారానే ఆసక్తిని రేకెత్తించిన సినిమాలలో ఒకటిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కనిపిస్తుంది. రాజేశ్ దండు నిర్మించిన ఈ సినిమాకి మోహన్ దర్శకత్వం వహించాడు. అల్లరి నరేశ్ - ఆనంది నాయకా నాయికలుగా నటించారు. మారేడుమిల్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఉదయం 10:36 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంతకుముందు తమిళ సినిమాలను వరుసగా చేస్తూ వెళ్లిన ఆనంది, ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా చేస్తోంది. వెన్నెల కిశోర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా కాగా, తన 60వ సినిమాను ఆయన 'నాంది' దర్శకుడితో చేస్తున్న సంగతి తెలిసిందే.