వాయుసేనకు 94,281 ‘అగ్ని పథ్’ దరఖాస్తులు
- నాలుగు రోజుల్లోనే భారీగా దరఖాస్తులు
- రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు వెల్లడి
- శుక్రవారం ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
‘అగ్నిపథ్’ పథకం కింద భారత వాయుసేనకు నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించి సోమవారం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘సోమవారం ఉదయం 10.30 సమయానికల్లా వాయుసేనకు 94,281 మంది అగ్నివీర్ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్ని పథ్’ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు ఇంకా ఎనిమిది రోజుల వరకు సమయం ఉండటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు.