తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల రేపే

  • రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న సబితా ఇంద్రారెడ్డి
  • ఫలితాల కోసం నిరీక్షిస్తున్న 9,07,393 మంది విద్యార్థులు
  • మే 6 నుంచి 24 వరకు జరిగిన పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ప్రకటన వెలువడింది. tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో వొకేషనల్ విద్యార్థులు కూడా ఉన్నారు. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. 

మరోవైపు పరీక్షా ఫలితాల విడుదల నేపథ్యంలో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. విద్యార్తులు ఒత్తిడికి  గురైనా, ఏవైనా సమస్యలు ఉన్నా 18005999333 నెంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. మరోవైపు పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 30న కానీ, జులై 1వ తేదీన కానీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. 


More Telugu News