జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు

  • గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులు
  • చంచల్‌గూడ జైలులో ఉన్న సాదుద్దీన్
  • జువెనైల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు
  • న్యాయ‌మూర్తి, పోలీసుల స‌మ‌క్షంలో నిందితుల గుర్తింపు
  • బాధితురాలు చెప్పిన వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్న పోలీసులు
హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ ప‌రిస‌రాల్లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.. మిగిలిన ఐదుగురు మైన‌ర్లు జువెనైల్ హోంలో ఉన్న సంగతి తెలిసిందే. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయ‌మూర్తికి తెలిపింది.

ఈ మేర‌కు నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను సోమ‌వారం పోలీసులు చేప‌ట్ట‌గా... చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు వివ‌రంగానే స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకున్నారు. ఈ వివ‌రాల‌ను వారు కోర్టుకు అంద‌జేయ‌నున్నారు.


More Telugu News