రోహిత్ శర్మ కరోనా బారినపడడంతో మయాంక్ అగర్వాల్ కు పిలుపు

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్డ్ టెస్టు
  • జులై 1 నుంచి షురూ
  • రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
  • ముందు జాగ్రత్తగా మయాంక్ అగర్వాల్ కు జట్టులో స్థానం
  • ఇంగ్లండ్ బయల్దేరిన మయాంక్
జులై 1 నుంచి ఇంగ్లండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టు ఆడాల్సి ఉండగా, టీమిండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారినపడడం జట్టులో కలకలం రేపింది. కరోనా పట్ల ఏమరపాటుతో ఉన్నాడంటూ రోహిత్ శర్మపై బీసీసీఐ ప్రముఖులు అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

అయితే, ఇంగ్లండ్ తో టెస్టు ప్రారంభమయ్యే నాటికి రోహిత్ శర్మ కోలుకోకపోతే, అతడికి ప్రత్యామ్నాయంగా కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ కు పిలుపు అందింది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో మయాంక్ అగర్వాల్ ను కూడా చేర్చారు. మయాంక్ ఇప్పటికే ఇంగ్లండ్ బయల్దేరాడని, త్వరలోనే బర్మింగ్ హామ్ లో టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.


More Telugu News