ఆడియో, వీడియో రూపంలోనూ తెలంగాణ పాఠ్యాంశాలు.. జులై 11 నుంచి విక్ర‌యం

  • పాఠ్య పుస్త‌కాల్లో చాప్ట‌ర్ల వారీగా క్యూఆర్ కోడ్‌లు
  • క్యూఆర్ కోడ్‌ల స్కానింగ్‌తో ఆడియో, వీడియో రూపంలో పాఠ్యాంశాలు
  • 1 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అన్ని పాఠ్య పుస్త‌కాలు ఒకేసారి విడుద‌ల‌
  • కాగితం ధ‌ర‌, టెండర్ల‌లో జాప్యమే ఆల‌స్యానికి కార‌ణ‌మ‌న్న పాఠ్య‌పుస్త‌కాల ప్ర‌చుర‌ణ‌ల సంచాలకులు
తెలంగాణ‌లో పాఠ‌శాల విద్యార్థులు త‌మ పాఠ్యాంశాల‌ను చ‌ద‌వ‌డంతో పాటుగా ఆడియో రూపంలో వినొచ్చు. వీడియో రూపంలో చూడొచ్చు. ఈ మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ కీల‌క మార్పులు చేసింది. పాఠ్య పుస్త‌కాల్లో చాప్ట‌ర్ల వారీగా క్యూఆర్ కోడ్‌ల‌ను విద్యా శాఖ ముద్రించ‌నుంది. ఈ కోడ్‌ల‌ను స్కాన్ చేయ‌డం ద్వారా ఆయా పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో విద్యార్థుల‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త మార్పుల‌కు సంబంధించి ప్ర‌భుత్వ పాఠ్య పుస్త‌కాల ప్ర‌చుర‌ణ‌ల సంచాల‌కులు శ్రీనివాసాచారి సోమ‌వారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

పాఠ్య పుస్త‌కాల‌ను జులై 6 నుంచి బ‌హిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని శ్రీనివాసాచారి ప్ర‌క‌టించారు. 1 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అన్ని పుస్త‌కాల‌ను ఒకేసారి బ‌హిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కాగితం ధ‌ర‌, ముద్ర‌ణ టెండర్ల ఖ‌రారులో నెల‌కొన్న జాప్యం కార‌ణంగానే ఈ ఏడాది ఆల‌స్యంగా పాఠ్య పుస్త‌కాల‌ను విడుద‌ల చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. నిర్ణీత ధ‌ర‌ల కంటే అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించే వారిపై ఆయా జిల్లాల డీఈఓలకు ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.


More Telugu News