రష్యా సైనికులను వణికించిన ఉక్రెయిన్ మేక
- సైనికులు మందు పాతరలు పెడుతుండగా పరుగెత్తుకెళ్లిన మేక
- 40 మందికిపైగా గాయపడినట్టు అంచనా
- ఉక్రెయిన్లోని కిన్ స్కీ గ్రామంలో ఘటన
- ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారుల వెల్లడి
ఓ మేక రష్యా సైనికులను వణికించింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 40 మందికిపైగా గాయపడటానికి కారణమైంది. రష్యా సైనికులు వేసిన ట్రాప్ తో వారే దెబ్బతినేలా చేసింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు ఏం జరిగిందంటే..
ఉక్రెయిన్ లోని జపొరోజియా పట్టణానికి కాస్త దూరంలో ఉన్న కిన్ స్కీ రోజ్డొరీ గ్రామంలోని ఆసుపత్రి సమీపంలో రష్యా సైనికులు బూబీ ట్రాప్ లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. గ్రనేడ్లను నేలలో వరుసగా అమర్చి వాటికి తీగలను అనుసంధానం చేసి పెడుతున్నారు. ఎవరైనా అటువైపుగా నడుస్తూ వచ్చినప్పుడు కాలికి తీగలు తాకి.. గ్రనేడ్లు పేలిపోతాయి.
సైనికులు అలా ట్రాప్ లను అమర్చుతుండగా.. కాస్త దూరంలో ఉన్న ఓ మేకల ఫామ్ నుంచి ఓ మేక తప్పించుకుని బయటికి వచ్చింది. ఆసుపత్రి వైపు వెళ్లి సైనికులు బూబీ ట్రాప్ లను అమర్చుతున్న ప్రాంతం వైపు పరుగెత్తింది. మొదట ఒక ట్రాప్ దాని కాలికి తగిలి గ్రనేడ్ పేలింది. దీనితో భయపడిన మేక వేగంగా పరుగెత్తడంతో వరుసగా ఒకదాని తర్వాత మరోటి గ్రనేడ్ లన్నీ పేలిపోయాయి. దీంతో వాటిని అమర్చుతూ వెళ్తున్న రష్యా సైనికులు కకావికలయ్యారు. ఈ పేలుళ్లలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు చనిపోయి ఉంటారని ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి.
ఈ పేలుళ్లలో సదరు మేక కూడా చనిపోయిందా? లేదా? అన్నది తెలియలేదని.. ఎందుకంటే ఆ ప్రాంతం రష్యా సైనికుల అధీనంలో ఉందని అధికారులు వెల్లడించారు. మొత్తానికి రష్యా సైనికులను వణికించిన ఈ మేకను ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడం గమనార్హం.