హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
  • కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్
  • లంగావోణీలో సంప్రదాయబద్ధంగా శ్రీకాంత్ కూతురు
  • ఇప్పటికే హీరోగా నటిస్తున్న శ్రీకాంత్ కుమారుడు
టాలీవుడ్ లోని అందమైన జంటల్లో శ్రీకాంత్, ఊహల జంట ఒకటి. పెళ్లయి ఇన్నేళ్లయినా వీరి మధ్య అనుబంధం, అన్యోన్యత అలాగే వున్నాయి. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాయంగా వీరు ఉన్నారు. వీరి కుమారుడు రోహన్ ఇప్పటికే హీరోగా నటిస్తున్నాడు. వీరికి మేధ అనే కూతురు ఉంది. యుక్త వయసుకు వచ్చిన మేధ ఆమె తల్లితండ్రుల మాదిరే ఎంతో అందంగా ఉంది. 

తాజాగా శ్రీకాంత్, ఊహ, రోహన్, మేధలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన వీరితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరోవైపు ఎరుపురంగు లంగావోణీలో మేధ ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించింది. మేధ ఎలా ఉందో కింది వీడియోలో చూడండి. 


More Telugu News