తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు!

  • ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
  • మధ్యప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి
  • నిన్న రాష్ట్రంలో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతల నమోదు
తెలంగాణలో నిన్న మధ్యాహ్నం, రాత్రి పలుచోట్ల భారీ వర్షాలతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఈరోజు, రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వెల్లడించింది. 

మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు వర్షాల కారణంగా నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.


More Telugu News