పంజాబ్ సీఎం భగవంత్‌కు షాక్... సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓటమి
- సంగ్రూర్ ఎంపీగా రెండు సార్లు విజయం సాధించిన భగవంత్
- ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎన్నిక కావడంతో ఎంపీ పదవికి రాజీనామా
- ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా గుర్మైల్ సింగ్
- శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) తరఫున పోటీకి దిగిన సిమ్రన్ జిత్ మాన్
- గుర్మైల్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో సిమ్రన్ జిత్ మాన్ విజయం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు పంజాబ్ నూతన సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్‌కు షాక్ తగిలింది. భగవంత్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైంది. సంగ్రూర్ నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన భగవంత్... మొన్నటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఎంపిక కావడం, ఆప్ ఘన విజయం సాధించడంతో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో సంగ్రూర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా... ఆదివారం మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు కూడా పూర్తి అయిపోయింది. ఉప ఎన్నికలో ఆప్ తరఫున గుర్మైల్ సింగ్ బరిలోకి దిగారు. శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) పార్టీ తరఫున సిమ్రన్ జిత్ మాన్ నిలవగా... గుర్మైల్‌పై ఆయన 8 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు.