కరోనాతో 25 మంది మృతి.. దేశవ్యాప్తంగా మరో 11,739 కేసులు నమోదు
- దేశంలో ఇప్పటివరకు మొత్తంగా 4,33,89,973 కేసులు నమోదు
- మొత్తంగా 5,24,999కి చేరిన మరణాలు
- రోజువారీ పాజిటివిటీ రేటు 2.59గా నమోదు
దేశవ్యాప్తంగా ఆదివారం కొత్తగా 11,739 కరోనా కేసులు నమోదయ్యాయని.. కరోనా కారణంగా 25 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,89,973కు, మరణాల సంఖ్య 5,24,999కు చేరినట్టు ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసులు 92,576గా ఉన్నాయని తెలిపింది. ముందు రోజుతో పోలిస్తే 797 యాక్టివ్ కేసులు పెరిగాయని ప్రకటించింది.
- ఆదివారం ప్రకటించిన 25 మరణాల్లో కేరళలో 10, ఢిల్లీలో 6, మహారాష్ట్ర 4, పశ్చిమబెంగాల్ లో 2, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ లలో ఒక్కొక్కరు మరణించినట్టు వివరించింది.
- దేశవ్యాప్తంగా సగటున రోజువారీ పాజిటివిటీ రేటు 2.59గా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.25గా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- దేశంలో కొవిడ్–19 వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రజలకు ఇప్పటివరకు 197 కోట్ల 8 లక్షల డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపింది.
- మన దేశం 2020 ఆగస్టు 7న 20 లక్షల కేసుల మార్కు దాటింది. అదే ఏడాది ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసుల మార్క్ ను దాటింది.
- ఇక 2020 డిసెంబర్ 19న కోటి కేసులు, 2021 మే 4న రెండు కోట్లు, అదే ఏడాది జూన్ 23న మూడు కోట్ల కేసులు దాటాయి. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల కేసులు దాటాయి.