మీకు దమ్ముంటే పార్టీని వీడి ఎన్నికల్లో పోరాడండి.. రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాక్రే సవాల్
- మా తప్పేమైనా ఉంటే చూపండి
- ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో లోపాలేమైనా ఉన్నాయా?
- తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని మర్చిపోబోమని వ్యాఖ్య
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాక్రే బహిరంగంగా సవాలు విసిరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలవాలన్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముంబైలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆదిత్య థాక్రే మాట్లాడారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.
మా తప్పేదైనా ఉంటే చెప్పండి
‘‘మీకు ఏ మాత్రం దమ్ము, ధైర్యమున్నా శివసేన పార్టీని వదిలేయండి. మా తప్పేంటో చెప్పి పోరాటం చేయండి. మేం ఏదైనా తప్పు చేశామా? ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో ఏమైనా లోపముందా? మేమంతా ఏదైనా తప్పు చేస్తున్నామా?.. అలా అయితే పార్టీకి రాజీనామా చేయండి. ఎన్నికల్లో పోరాడండి. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం..” అని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆదిత్య సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన నమ్మక ద్రోహాన్ని తాము ఎప్పటికీ మర్చిపోబోమని స్పష్టం చేశారు.