టీ హ‌బ్ హైద‌రాబాద్ నిర్మాణం పూర్తి... 28న కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

  • హైద‌రాబాద్‌లో టీ హ‌బ్ హైద‌రాబాద్‌
  • నిర్మాణం పూర్తి అయిన ఫొటోల‌ను షేర్ చేసిన కేటీఆర్‌
  • దీనితో ఇన్నోవేష‌న్ ఎకోసిస్ట‌మ్‌కు జ‌వ స‌త్వాలన్న మంత్రి
  • తెలంగాణ యువ‌త‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలన్న కేటీఆర్‌
తెలంగాణ స‌ర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేప‌ట్టిన టీ హ‌బ్ హైద‌రాబాద్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యింది. హైద‌రాబాద్‌లో కొత్త‌గా అందుబాటులోకి వ‌స్తున్న ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈ నెల 28న ప్రారంభించ‌నున్న‌ట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేసిన కేటీఆర్‌.... టీహ‌బ్ నిర్మాణాల‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా దానికి జోడించారు. 

టీ హ‌బ్ హైద‌రాబాద్ ప్రారంభంతో తెలంగాణ‌లో ఇన్నోవేష‌న్ ఎకో సిస్ట‌మ్‌కు పునరుజ్జీవం రానుంద‌ని, ఈ రంగంలో మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు రానున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా అమెరికా మాజీ అధ్య‌క్షుడు అబ్ర‌హం లింక‌న్ చెప్పిన ఓ సూక్తిని కేటీఆర్ ప్ర‌స్తావించారు. భ‌విష్య‌త్తు ఊహ‌కు దానిని సృష్టించుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మైన మార్గ‌మ‌న్న లింక‌న్ మాట‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.


More Telugu News