ఉప ఎన్నికలో 12 రౌండ్లలో 50 వేలకు పైగా ఆధిక్యం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి
- కొనసాగుతున్న ఆత్మకూరు బైపోల్ కౌంటింగ్
- ఇప్పటికే పూర్తి అయిన 12వ రౌండ్ లెక్కింపు
- భారీ ఆధిక్యం దిశగా వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి
- మధ్యాహ్నంలోగానే వెలువడనున్న ఫలితం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 11 గంటల సమయానికి 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా... విక్రమ్ రెడ్డి 50,654 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు.
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంలో జరిగిన ఈ ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడిని నిలబెట్టడంతో ఏళ్ల తరబడి పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టింది. వీరిద్దరితో పాటు మరో 12 మంది బరిలో నిలవగా...ఈ నెల 23న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నంలోగా ఉప ఎన్నిక ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.