జులై 3న అల్పపీడనం.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్న రుతుపవనాలు
- కొనసాగుతున్న ద్రోణి
- అరేబియా సముద్రం నుంచి వీస్తున్న రుతుపవన గాలులు
- కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు
వచ్చే నెల 3వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆరో తేదీ నాటికి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పడమర తీరంలో దక్షిణ గుజరాత్ నుంచి కేరళ వరకు తీర ద్రోణి కొనసాగుతోంది. అక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పడమర ద్రోణి విస్తరించిందని, వీటి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి రుతుపవన గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఫలితంగా ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు, కోస్తా, రాయలసీమల్లో నిన్న పలుచోట్ల వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.