బాల్ థాకరే పేరు వాడొద్దు: రెబెల్స్ కు శివసేన వార్నింగ్
- తమ గ్రూపుకు 'శివసేన బాలాసాహెబ్' పేరు పెట్టుకున్న రెబెల్స్
- రెబెల్స్ ఎవరూ బాల్ థాకరే పేరు వాడరాదంటూ శివసేన సమావేశంలో తీర్మానం
- ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని థాకరేకు కట్టబెట్టిన నేతలు
శివసేనలో పుట్టిన ముసలం కారణంగా అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబెల్స్ తమ గ్రూపుకు 'శివసేన బాలాసాహెబ్' అనే పేరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. రెబెల్ నేత షిండే సహా ఏ ఒక్క రెబెల్ ఎమ్మెల్యే కూడా బాల్ థాకరే పేరును వాడరాదని ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఇంకోవైపు పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ థాకరే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు.
ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాకరే సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. మీ తండ్రుల పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని వ్యాఖ్యానించారు. బాల్ థాకరే పేరు వాడొద్దని హెచ్చరించారు.