ఒక్క నంబర్‌తో అన్ని బ్యాంకింగ్ సేవలు.. కొత్త టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించిన స్టేట్ బ్యాంకు
- ఖాతాదారులకు తీపి కబురు చెప్పిన స్టేట్ బ్యాంకు
- కొత్త టోల్ ఫ్రీ నంబర్ 1800 1234
- సులువుగా గుర్తుంచుకునేలా అందుబాటులోకి..
- ఇప్పటికే ఉన్న టోల్ ఫ్రీ నంబర్లు కూడా కొనసాగింపు
దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్న స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులు ఇంటివద్ద నుంచే పొందగలిగేలా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారులు ఎవరైనా అత్యంత సులభంగా గుర్తుంచుకోగలిగేలా 1800 1234 టోల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెట్టింది. దీనికి కాల్ చేయడం ద్వారా ఖాతాలో ఉన్న నగదు నిల్వ, ఇంతకు ముందటి 5 లావాదేవీలు, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కులకు సంబంధించిన వివరాలు, బ్లాక్ చేయడం, కొత్త వాటి కోసం దరఖాస్తు చేయడం వంటివన్నీ చేసుకోవచ్చని స్టేట్ బ్యాంకు ప్రకటించింది.
సులభంగా ఉండటం కోసం..
ఇంటర్నెట్, యాప్ లు, ఇతర ఆన్ లైన్ విధానాలను వినియోగించుకోలేని ఖాతాదారులకు ఈ కొత్త టోల్ ఫ్రీ నంబర్ ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. పెద్ద వయసువారు కూడా సులభంగా వినియోగించుకోవచ్చు. దీని సేవలు వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణ సమయాల్లో కూడా ఉపయోగకరంగా ఉండనుంది. ఇక ఇప్పటికే ఉన్న ఇతర టోల్ ఫ్రీ నంబర్లు కూడా యథాతథంగా కొనసాగుతాయని స్టేట్ బ్యాంకు తెలిపింది.