సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన విడదల రజని
- మేనిఫెస్టోలోని హామీల్లో 95 శాతం అమలు చేసిన ఘనత జగన్ ది
- వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది
- ప్రతి నెల ఒకటో తేదీన పింఛను ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం మాత్రమే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి విడదల రజని ప్రశంసలు కురిపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదని ఆమె కొనియాడారు. పాలనను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడానికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఈ పథకాల వల్ల మేలు జరుగుతుందని అన్నారు.
ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతోందని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామున ఐదున్నరకే లబ్ధిదారులకు పింఛను ఇచ్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 700 కోట్లు లబ్ధిదారులకు చేరాయని చెప్పారు.