చంద్రబాబుతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను పవన్ ఓడించలేరు: అంబటి రాంబాబు

చంద్రబాబుతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను పవన్ ఓడించలేరు: అంబటి రాంబాబు
  • ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్న అంబటి 
  • ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగన్ ను ఏమీ చేయలేవని  వ్యాఖ్య  
  • జులై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నామన్న మంత్రి 
ఏపీలో మళ్లీ రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగన్ ను ఏమీ చేయలేవని చెప్పారు. జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. ఒక్క రూపాయి అవినీతికి కూడా తావు లేకుండా ఇప్పటి వరకు లక్షా యాభై వేల కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశామని చెప్పారు. 

వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వనని చెపుతున్న పవన్ కల్యాణ్ ఒకసారి బీజేపీతో పొత్తు అంటారని, మరొకసారి ప్రజలతోనే పొత్తు అంటారని, ఇంకోసారి మూడు ఆప్షన్లు అంటారని ఎద్దేవా చేశారు. తన రహస్య మిత్రుడు చంద్రబాబుతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను పవన్ ఓడించలేరని వ్యాఖ్యానించారు. జులై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించబోతున్నామని తెలిపారు.


More Telugu News