కొరియన్ల ఆరోగ్య రహస్యాలు ఇవే..!
- సముద్రపు ఉత్పత్తులకు ప్రాధాన్యం
- పులియబెట్టిన ఆహారానికి ఓటు
- కూరగాయలకు ఎక్కువ చోటు
- హానికారక పదార్థాలకు దూరం
కొరియా వాసులు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఆహారం విషయంలో వారు నియమబద్ధంగా ఉంటారు. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యం కోసం తాము వీటిని తీసుకుంటున్నామనే భావన వారిలో ఉండదు. వారు ఇష్టంగా తీసుకునేవి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు కావడం సానుకూలం. శారీరక వ్యాయామం అన్నది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, కొరియన్లు ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా, ఆరోగ్యంగా ఉండడానికి వెనుక ఆహారం, జీవనశైలే అని చెప్పుకోవాలి. ఆరోగ్యం కోరుకునే వారు కొరియన్లను ఫాలో అయితే పోదూ..!
కూరగాయలకే పెద్దపీట
కూరగాయల్లో ఎన్నో సహజ పోషకాలు ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకేనేమో కొరియన్లు కూరగాయలకే ఎక్కువ చోటు ఇస్తారు. ఆహారంలో వీటి పాత్రే ఎక్కువ. ముల్లంగి, బాంబూ, వేరుతో కూడిన కూరగాయలు (క్యారెట్, ఉల్లి, బీట్ రూట్, చిలగడ దుంప, బంగాళాదుంప, కొత్తి మీర తదితర) ఎక్కువగా తీసుకుంటారు. ఇవే వారి ప్రధాన ఆహారం. మనం మాత్రం ఆహారంలో పదో వంతే కూరలను తీసుకుంటుంటాం. కానీ కొరియన్లు కూరలకే ఎక్కువ వాటా కేటాయిస్తారు. దీనివల్ల బరువు ఏ మాత్రం పెరగకుండా మంచి నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొవ్వులు పెరగవు.
పులిసిన పదార్థాలు
పులియబెట్టిన ఆహార పదార్థాలు కూడా కొరియన్లకు ఇష్టం. ఉదాహరణకు మనం అల్పాహారంలో భాగంగా తీసుకునే దోశ, ఇడ్లీ కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. కొరియన్లు ‘కిమిచి’ పేరుతో పులియబెట్టిన డిష్ ను ఎక్కువగా తీసుకుంటారు. క్యాబేజీ, ముల్లంగి, గ్రీన్ ఆనియన్, ఉప్పు, చక్కెర, అల్లం, వెల్లుల్లి, మిరప అన్నీ కలిపి పులియబెట్టి చేసుకునే వంటకం ఇది. ఇందులో మంచి ప్రోబయోటిక్ ఉంటుంది.
సీ ఫుడ్
చేపలు, ఇతర సముద్రపు ఉత్పత్తుల్లో మంచి ప్రొటీన్ ఉంటుంది. గుండెకు ఎంతో మేలు చేసే ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ చేపల్లో దండిగా ఉంటాయి. కొరియా తీర ప్రాంతం కావడంతో ఇవి తగినంతగా లభిస్తుంటాయి. అందుకే వారి ఆహారంలో ఇవి భాగం. అన్ని రకాల సముద్రపు ఆహారాన్ని వారు తీసుకుంటూ ఉంటారు.
ప్రొసెస్డ్ ఫుడ్స్
ఆరోగ్యానికి చేటు చేసే వాటికి కొరియన్లు దూరంగా ఉంటారు. లేదా చాలా తక్కువగా తీసుకుంటారు. శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలను వారు సాధ్యమైనంత తక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా వారు ఇంటి ఆహారానికే ప్రాముఖ్యం ఇస్తారు. అందుకే వారి ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది.