ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించిన బీజేపీ ఎంపీ

  • ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
  • నామినేషన్ పత్రాల సమర్పణ
  • బాల్య వివాహ బాధితురాలని వెల్లడించిన పీసీ మోహన్
  • గృహ హింసను కూడా ఎదుర్కొన్నారని వివరణ
ఏమాత్రం అంచనాలు లేకుండా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురించి బీజేపీ ఎంపీ పీసీ మోహన్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆమె జీవన ప్రస్థానం, ఆమె సహనం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 

ముర్ము బాల్య వివాహ బాధితురాలని, 15 ఏళ్లకే తల్లయిందని తెలిపారు. అంతేకాదు, గృహహింసను కూడా ఎదుర్కొన్నారని పీసీ మోహన్ వివరించారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె కనబర్చిన దృఢవైఖరి ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని కొనియాడారు. ఆధునిక భారతదేశ స్ఫూర్తికి ముర్ము ప్రతిరూపమని కీర్తించారు. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం ద్వారా ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యం మురిసిపోతోందని పీసీ మోహన్ పేర్కొన్నారు.


More Telugu News