వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై దుండగుల దాడి... వీడియో ఇదిగో
- వయనాడ్ ఎంపీగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ
- నగరంలోని రాహుల్ కార్యాలయంపై దుండగుల దాడి
- సీపీఎం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న కేసీ వేణుగోపాల్
- నిందితులపై చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి
- ఈ తరహా ఘటనలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన కార్యాలయంపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వయనాడ్‌లో ఆయన తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో కార్యాలయంలోని సామగ్రి ధ్వంసం అయ్యింది.
ఈ దాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... కేరళలోని సీపీఎం ప్రభుత్వమే ఈ దాడికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేరళ పోలీసుల కళ్లెదుటే దుండగులు దాడికి దిగారని కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. వెరసి ఈ దాడి వెనుక సీపీఎం ఉందని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉంటే... ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కేరళ సీఎం పినరయి విజయన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన కేరళ సర్కారును కోరారు. ఇలాంటి ఘటనలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు.