ఏపీ హైకోర్టుకు క్షమాపణ చెప్పిన కోనసీమ అల్లర్ల పిటిషనర్... రూ.50 లక్షల జరిమానాను తప్పించుకున్న వైనం
- కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని పిటిషన్
- పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
- రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశముందని కోర్టు వ్యాఖ్య
- పిటిషనర్ సారీ చెప్పడంతో పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
కోనసీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి జిల్లా కేంద్రం అమలాపురంలో చోటుచేసుకున్న అల్లర్లపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు... పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ విద్వేషాలను రెచ్చగొట్టేదిగానే ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా ఈ తరహా పిటిషన్లు మంచిది కాదని కూడా హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను బాధ్యతారహితమైనదిగా పరిగణిస్తూ రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని కోర్టు పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలతో భీతిల్లిన పిటిషనర్...బేషరతుగా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. దీంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.