నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియామకం

  • నీతి ఆయోగ్ కు కొత్త సీఈవో
  • రెండేళ్ల పాటు కొనసాగనున్న అయ్యర్
  • ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్
  • ఈ నెల 30తో ముగియనున్న అమితాబ్ పదవీకాలం
దేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన వ్యవస్థ నీతి ఆయోగ్. సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రగతిశీల, సమగ్రాభివృద్ధి అజెండా అమలు చేయడం నీతి ఆయోగ్ ప్రధాన విధి. తాజాగా, నీతి ఆయోగ్ కు కొత్త సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కాంత్ వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. 

ఈ నేపథ్యంలో, కొత్త సీఈవో నియామకం చేపట్టారు. పరమేశ్వరన్ అయ్యర్ ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరమేశ్వరన్ అయ్యర్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మోదీకి ఇష్టమైన స్వచ్ఛ్ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో అయ్యర్ కృషి ప్రశంసలందుకుంది.


More Telugu News