చింతామ‌ణి నాటకం నిషేధంపై స్టేకు ఏపీ హైకోర్టు నిరాక‌ర‌ణ‌

  • చింతామ‌ణి నాటకం త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తోందన్న ఆర్య‌వైశ్యులు
  • 2020లోనే కోర్టును ఆశ్ర‌యించిన ఆర్య‌వైశ్య సంఘం
  • 2022 జ‌న‌వ‌రిలో నాటకంపై నిషేధం విధిస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం
  • ఈ నిర్ణ‌యంపై ప‌లువురు ఉపాధి కోల్పోయారంటూ హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌ఘురామ‌రాజు
  • త‌దుప‌రి విచార‌ణ ఆగ‌స్టు 17కు వాయిదా
చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధిస్తూ ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై స్టే విధించేందుకు ఏపీ హైకోర్టు నిరాక‌రించింది. ఈ మేర‌కు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు...నాట‌కం నిషేధంపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 17కు వాయిదా వేసింది.

చింతామ‌ణి నాటక ప్ర‌ద‌ర్శ‌న త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీసేదిగా ఉందంటూ ఆర్య‌వైశ్య సంఘం ప్ర‌తినిధులు 2020లో కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత‌ ఏపీ ప్ర‌భుత్వం నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌పై నిషేధం విధిస్తూ 2022 జ‌న‌వ‌రిలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌ల్ల ప‌లువురు ఉపాధి కోల్పోయార‌ని, నాట‌కాన్ని నిషేధించ‌డం వాక్‌స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని ర‌ఘురామ‌రాజు హైకోర్టును ఆశ్ర‌యించారు.


More Telugu News