టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
- 2014లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన తాటి
- ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన వైనం
- టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఇటీవల ఆరోపణ
- తాజాగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నంత పనీ చేసేశారు. 2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేశ్వర్లు... ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2018 ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసినా... పార్టీ నేతలు సహకరించని కారణంగానే తాను ఓటమిపాలయ్యానని ఇటీవలే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీలో తనలాంటి సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ వీడతానని కూడా ఆయన పార్టీ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు.
తాజాగా శుక్రవారం ఆయన నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ముందుకు వచ్చే వారితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.