వరుసగా రెండో రోజూ లాభపడ్డ మార్కెట్లు

  • ముడి చమురు ధరలు తగ్గడంతో మార్కెట్లలో జోష్
  • 462 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 143 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు మార్కెట్లకు అండగా నిలిచాయి. చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 462 పాయింట్లు లాభపడి 52,728కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,699 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.28%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (2.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.30%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.02%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.3%), ఇన్ఫోసిస్ (-0.77%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.50%), టీసీఎస్ (-0.49%), విప్రో (-0.16%).


More Telugu News