ఎమ్మెల్యే అలా చేత్తో తోస్తే ఇలా పడిపోయిన కాలేజీ గోడ!... యోగి సర్కారుపై అఖిలేశ్ సెటైర్లు!
- రూ.100 కోట్లతో సర్కారీ ఇంజినీరింగ్ కాలేజీని కడుతున్న యోగి ప్రభుత్వం
- పనుల నాణ్యతను పరిశీలించేందుకు వెళ్లిన ఎస్పీ ఎమ్మెల్యే ఆర్కే వర్మ
- అనుమానం వచ్చి గోడను చేత్తో తోసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కోట్లాది రూపాయల సర్కారీ నిధులతో నిర్మిస్తున్న ఓ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల గోడలు.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్కే ఇలా చేత్తో తోస్తే... అలా పడిపోయాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే చేతుల్లోని బలంతోనే గోడలు పడిపోయాయనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే నాసిరకం ఇసుక, సిమెంట్‌తో కట్టిన కారణంగానే ఎమ్మెల్యే ఊరికే అలా చేత్తో తోస్తే... ఆ గోడలు ఇలా పడిపోయాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా రాణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివ్ సత్‌లోని అటవీ ప్రాంతంలో దాదాపుగా రూ.100 కోట్ల నిధులతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సర్కారీ ఇంజినీరింగ్ కాలేజీని నిర్మిస్తోంది. పునాది పూర్తి అయి... గోడలు ఓ మోస్తరు ఎత్తుకు లేచాయి.
ఈ నిర్మాణాల నాణ్యత ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే వర్మ అక్కడికి వచ్చారు. పనుల నాణ్యతపై ఆయనకు అనుమానాలు రేకెత్తాయి. అంతే... ఓ గోడను అలా చేత్తో తడితే ఊగింది. ఇంకేముంది మరికాస్తగా తోయడంతో ఉన్నపళంగా ఆ గోడ అలా పడిపోయింది. ఆ తర్వాత మరో గోడను ఆయన చేత్తో తోయగా అది కూడా పడిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను స్వయంగా ఆర్కే వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'యోగి సర్కారు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల నాణ్యత ఇదీ' అంటూ ఆయన ఆ వీడియోకు కామెంట్‌ను జత చేశారు. ఈ వీడియోను చూసినంతనే ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బీజేపీ సర్కారుపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు అంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించారు. సిమెంట్ లేకుండా అలా ఇటుకలు పేర్చితే ఇలాగే జరుగుతుందని కూడా ఆయన సెటైర్ సంధించారు.