సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం... పలు నిర్ణయాలకు ఆమోదం

  • ఇటీవల ఏపీ మంత్రివర్గ విస్తరణ
  • తొలిసారి సమావేశమైన నూతన మంత్రివర్గం
  • 42 అంశాలపై చర్చ
  • కోనసీమ జిల్లాకు పేరుమార్పు ప్రతిపాదనకు ఆమోదం
ఇటీవల ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా క్యాబినెట్ భేటీ జరిగింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త మంత్రివర్గం సమావేశమైంది. 42 అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మూడో విడత అమ్మ ఒడి పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

జులై నెలలో అమలు చేసే జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ వాహనమిత్ర, కాపు నేస్తం తదితర పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు, వివాదాస్పదమైన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించి ఆమోదించినట్టు సమాచారం.


More Telugu News