టమాటా సాస్ తో ఐస్ క్రీమ్.. ఇదెక్కడి దారుణమంటూ నెటిజన్ల ట్రోలింగ్
- కెనడాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్రెంచీస్ కంపెనీ
- కావాలంటే ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చంటూ ప్రచారం
- అటు సాస్.. ఇటు ఐస్ అంటూ ట్విట్టర్లో పెట్టిన సంస్థ
- సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగిన నెటిజన్లు
వెనీలా.. స్ట్రాబెర్రీ.. బట్టర్ స్కాచ్.. ఇలా ఒకటా రెండా.. ఐస్ క్రీమ్ లలో ఎన్నో రుచులు. ఈ మధ్య డ్రై ఫ్రూట్లు, సాధారణ పండ్లతో తయారు చేసే ఐస్ క్రీమ్లూ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. కానీ కెనడాకు చెందిన ఫ్రెంచీస్ అనే కంపెనీ సరికొత్తగా టమాటా సాస్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ ను మార్కెట్లోకి వదిలింది. అటు సాస్ రుచి.. ఇటు ఐస్ చల్లదనం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. 100 శాతం కెనడా టమాటాలతో కెచప్, టమాటా జ్యూస్, పెప్పర్ (మిర్చి) సాస్ లను కలిపి దీనిని తయారు చేస్తున్నామంటూ ట్విట్టర్ లో ప్రచార వీడియో కూడా పెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది.
ఎంత ఎండా కాలమైతే మాత్రం..!
ప్రస్తుతం కెనడాలో ఎండాకాలం కొనసాగుతోంది. ఎండల్లో చల్లదనం అంటూనే ఫ్రెంచీస్ సంస్థ టమాటా సాస్ ఐస్ క్రీమ్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఇదీ లిమిటెడ్ ఎడిషన్ అని.. కెనడా వ్యాప్తంగా కొంతకాలమే అందుబాటులో ఉంటాయనీ ఊరించడం మొదలుపెట్టింది. దీనితో ‘ఎంత ఎండాకాలమైతే మాత్రం.. ఇంత దారుణమా..?’ అంటూ వెక్కిరించడం మొదలైంది. ‘కెచప్ అంటే ఎంతో ఇష్టం కానీ.. ఇలా ఐస్ క్రీమ్ లానూ తినాలా?’ అంటూ కొందరు.. ‘అసలు కెనడాలో ఏం జరుగుతోంది?’, ‘సాస్ అయిపోయింది ఇంకేం తెస్తున్నారు?’.. ఇలా కామెంట్ల మీద కామెంట్లు పడిపోతున్నాయి.