షిండే గూటికి మరో ముగ్గురు సేన ఎమ్మెల్యేలు.. 49కి పెరిగిన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య
- పతనం అంచున ఉద్ధవ్ సర్కారు
- 12 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్‌కు శివసేన లేఖ
- ఇలాంటి వాటికి తాము భయపడబోమన్న షిండే
- బాల్ థాకరే నిజమైన శివసైనికులం తామేనని ఉద్ఘాటన
‘మహా’ రాజకీయం క్షణక్షణం మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. ఇప్పటికే తమ శిబిరంలో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే చెబుతుండగా, ఇప్పుడు మరో ముగ్గురు సేన శాసనసభ్యులు ఆయన గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అదే జరిగితే అప్పుడు ‘రెబల్ సేన’లోని మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 49కి చేరుతుంది.
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేలు తనను వారి నేతగా ఎన్నుకోవడంతో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు. శివసేన లెజిస్టేచర్ పార్టీ నేతను తానేనని అందులో పేర్కొన్నారు. అలాగే, భరత్‌షెట్ గోగవాలేను చీఫ్‌విప్‌గా నియమించాలని కోరారు. ఆ లేఖపై మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
మరోపక్క, నిన్న జరిగిన పార్టీ సమావేశానికి హాజరు కాని 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన శివసేన.. డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాస్తూ.. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. దీనిపై ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఇలాంటి ప్రయత్నాలతో తమను భయపెట్టలేరని తేల్చి చెప్పారు. ఎందుకంటే గౌరవనీయులైన శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరే నిజమైన శివసైనికులం తామేనని షిండే తేల్చి చెప్పారు.