కుతంత్రాలతో నా పల్నాడు పర్యటనని పోలీసులు అడ్డుకోవాలనుకున్నారు: నారా లోకేశ్
- జల్లయ్య కుటుంబానికి పరామర్శ కోసం పల్నాడుకు లోకేశ్
- దారి పొడవునా లోకేశ్‌కు పార్టీ శ్రేణుల స్వాగతం
- ప్రజాభిమానం చూసి పోలీసులు వెనక్కు తగ్గారన్న లోకేశ్
ఇటీవల ప్రత్యర్థుల దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అయితే తన పర్యటనను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా 2 వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు.
కుతంత్రాలతో తన పల్నాడు పర్యటనని పోలీసులు అడ్డుకోవాలనుకున్నారంటూ ఆ ట్వీట్లలో లోకేశ్ ఆరోపించారు. అయితే అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి పోలీసులు వెనక్కితగ్గారని ఆయన చెప్పారు. పిడుగురాళ్ల పట్టణంలో యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనకు ఘనస్వాగతం లభించిందని తెలిపారు. దారి పొడవునా నేతలు, కార్యకర్తలు తనపై కురిపించిన అభిమానం ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ లోకేశ్ పేర్కొన్నారు.