ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌తో ద్రౌప‌ది ముర్ము భేటీ

  • ఢిల్లీ చేరుకున్న ద్రౌప‌ది ముర్ము
  • వ‌రుస‌బెట్టి ప్ర‌ముఖుల‌ను క‌లుస్తున్న ముర్ము
  • ఉప‌రాష్ట్రప‌తి అధికారిక నివాసంలో వెంక‌య్య‌తో భేటీ
రాష్ట్రప‌తి ఎన్నికల్లో అధికార ప‌క్షం ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ము గురువారం దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి చేరిన వెంట‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆమె... ఆ త‌ర్వాత ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడుతోనూ ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 

ఎన్డీఏ త‌ర‌ఫున రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో వెంక‌య్య పేరు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాదికి చెందిన నేత‌ను ఎంపిక చేయాల‌నుకున్న ప‌క్షంలో వెంక‌య్యే ఎన్టీఏ అభ్య‌ర్థిగా ఖ‌రారై ఉండేవార‌న్న వాద‌న‌లు వినిపించాయి. అంతేకాకుండా బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డు స‌మావేశం స‌మ‌యంలో ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలంటూ వెంక‌య్య‌కు స‌మాచారం రావ‌డం, ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో ఉన్న వెంక‌య్య త‌న అన్ని కార్యక్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకుని మ‌రీ ఢిల్లీ వెళ్లడం చూసి వెంక‌య్య అభ్య‌ర్థిత్వం ఖ‌రారైపోయినట్టేన‌న్న వాద‌న‌లు వినిపించాయి. అయితే మ‌హిళ‌... అది కూడా గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్న నిర్ణ‌యంతో సాగిన బీజేపీ ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ఖరారు చేసింది.


More Telugu News