రేపు ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
- ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
- కోస్తాంధ్రలోని 3 జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు
- రాయలసీమలోని శ్రీ బాలాజీ జిల్లాకూ వర్ష సూచన
ఏపీలోని పలు జిల్లాల్లో రేపు (శుక్రవారం) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలతో పాటు రాయలసీమలోని ఓ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు , కాకినాడ , కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంబేద్కర్ తెలిపారు. అదే సమయంలో రాయలసీమలోని శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.