టాలీవుడ్ లో ముగిసిన సంక్షోభం.. రేపటి నుంచి షూటింగులకు హాజరుకానున్న సినీ కార్మికులు
- వేతనాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన సినీ కార్మికులు
- నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ నేతల మధ్య చర్చలు సఫలం
- దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు
ఎట్టకేలకు టాలీవుడ్ లో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. సినీ కార్మికులు సమ్మెను విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల సేపు వీరు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీతో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో, సమ్మెను విరమిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులంతా యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారని తెలిపారు.