సంక్షోభంలో టాలీవుడ్.. నిలిచిపోయిన 28 సినిమాల షూటింగులు!
- వేతనాలు పెంచాలని సినీ కార్మికుల సమ్మె
- వేతనాలు పెంచేంత వరకు షూటింగులకు హాజరు కాబోమన్న కార్మికులు
- ఎక్కడికక్కడ నిలిచి పోయిన షూటింగులు
కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇంతలోనే టాలీవుడ్ లో పెను సంక్షోభం తలెత్తింది. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఇండస్ట్రీలో అన్ని విభాగాల కార్మికులు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న 28 సినిమాల షూటింగులు ఆగిపోయాయి.
మరోవైపు కార్మికుల వేతనాలను పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాతల మండలి ప్రకటించింది. కార్మికులంతా యథావిధిగా షూటింగులకు హాజరు కావాలని... లేకపోతే ఆరు నెలల పాటు షూటింగులు ఆపేస్తామని చెప్పారు. అయితే కార్మికులు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. వేతనాలు పెంచేంత వరకు షూటింగులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.