ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్
  • మంత్రి మేకపాటి హఠాన్మరణంతో ఉప ఎన్నిక
  • పోటీలో మేకపాటి సోదరుడు విక్రంరెడ్డి
  • సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
  • 26న ఫలితం వెల్లడి
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నిక బరి నుంచి టీడీపీ తప్పుకోగా, వైసీపీ నుంచి మేకపాటి సోదరుడు విక్రంరెడ్డి, బీజేపీ నుంచి జి.భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. 

మొత్తం 2,13,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనుండగా, వీరి కోసం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 131 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడిస్తారు.


More Telugu News