ఫ్రాన్స్‌లో విరుచుకుపడుతున్న కరోనా.. కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నామన్న వ్యాక్సినేషన్ చీఫ్
- భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
- ఫ్రాన్స్‌లో నిన్న ఒక్క రోజే 50 వేలకుపైగా కేసులు
- యూరప్‌లో వైరస్ విజృంభణ మొదలు
- కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లే కారణమన్న ఈసీడీసీ
భారత్ సహా ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్రాన్స్‌లో వైరస్ మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రతి రోజూ వేలాది కేసులు నమోదవుతుండడంతో కొత్త వేవ్ తప్పదన్న ఆందోళన మొదలైంది.
ఇదే విషయాన్ని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ కూడా చెప్పారు. తామిప్పుడు కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న కేసులు చూస్తుంటే వైరస్ విజృంభణ తప్పదేమోనని అనిపిస్తోందన్నారు. అయితే, ఈ కొత్త వేవ్ తీవ్రత ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని మాత్రం తాము చెప్పలేమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు.
ఫ్రాన్స్‌లో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసులు ప్రజలను మళ్లీ భయాందోళనలలోకి నెట్టేశాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 50,402 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కొత్త కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. అంతేకాదు, ఏడు రోజుల వ్యవధిలోనే కేసులు మూడు రెట్లు పెరిగాయి.
ఇక, యూరోపియన్ దేశాల్లోనూ కేసుల పెరుగుదల మొదలైంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అయిన బీఏ.4, బీఏ.5 వేగంగా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ (ECDC) తెలిపింది. ప్రస్తుతానికి కరోనా బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కొత్త వేరియంట్లు రూపాంతరం చెందితే మాత్రం తీవ్రత ఎక్కువ ఉండొచ్చని పేర్కొంది.