ఏపీ పీజీ సెట్‌-2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

  • నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన యోగి వేమ‌న వ‌ర్సిటీ వీసీ  
  • రాష్ట్రంలోని 16 వ‌ర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు
  • ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ జులై 20
  • ఆగ‌స్టు 17 నుంచి ప్ర‌వేశ ప‌రీక్ష‌లు
ఏపీలోని విశ్వ‌విద్యాల‌యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ బుధ‌వారం రాత్రి విడుద‌లైంది. క‌డ‌ప‌లోని యోగి వేమ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ సూర్య క‌ళావ‌తి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. 

ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం... విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 145 కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థుల‌కు ప్రవేశం ల‌భించ‌నుంది. ద‌ర‌ఖాస్తుల‌కు జులై 20వ తేదీని గ‌డువుగా నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 17 నుంచి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.


More Telugu News