సోనియా విజ్ఞప్తికి ఓకే చెప్పిన ఈడీ... కొత్త తేదీలతో జారీ కానున్న సమన్లు
- నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఈడీ సమన్లు
- బుధవారం విచారణకు హాజరు కావాలన్న దర్యాప్తు సంస్థ
- అనారోగ్యంతో హాజరు కాలేకపోతున్నానన్న సోనియా
- సోనియా విజ్ఞప్తిని మన్నించిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జీ అయినా... ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఈ కారణంగా బుధవారం విచారణకు హాజరు కాలేనని సోనియా గాంధీ సదరు లేఖలో ఈడీకి తెలిపిన సంగతి తెలిసిందే.
సోనియా విజ్ఞప్తికి కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా సానుకూలంగానే స్పందించింది. సోనియా గాంధీ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుధవారం నాటి విచారణకు ఆమె రాలేకపోతున్నట్లు తెలిపిన లేఖను అంగీకరించిన దర్యాప్తు సంస్థ... కొత్త తేదీలతో మరోమారు ఆమెకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. గతంలో జారీ చేసిన సమన్ల మేరకు ఈడీ విచారణకు బుధవారం సోనియా హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.