ఈ నెల 27న అమ్మ ఒడి నిధుల విడుద‌ల‌... త‌ల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్ర‌మే జ‌మ‌

  • ల‌క్ష మంది విద్యార్థుల‌ను అన‌ర్హులుగా గుర్తించిన ప్ర‌భుత్వం
  • గైర్హాజ‌రు కార‌ణంగా 51 వేల మంది విద్యార్థుల తొల‌గింపు
  • అమ్మ ఒడి కోసం ఈ ఏడాది రూ.6,500 కోట్ల నిధుల కేటాయింపు
ఏపీలో అమ్మ ఒడి నిధుల విడుద‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 27న విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో ఈ ప‌థ‌కం నిధుల‌ను ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నుంది. అమ్మ ఒడి ప‌థ‌కం కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల‌ను విడుద‌ల చేస్తున్న ప్ర‌భుత్వం.. ఈ ఏడాది మాత్రం రూ.13 వేల చొప్పున మాత్ర‌మే జ‌మ చేయ‌నుంది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించ‌లేదు. అమ్మ ఒడి ప‌థ‌కం కోసం ఈ ఏడాది రూ.6,500 కోట్ల‌ను కేటాయించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఇదిలా ఉంటే... గ‌తేడాది అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ ఏడాది ల‌క్ష మందికి పైగా విద్యార్థుల‌ను అన‌ర్హులుగా తేల్చింది. పాఠశాల‌లకు గైర్హాజ‌రు కార‌ణంతో 51 వేల మంది విద్యార్థుల‌ను అన‌ర్హులుగా తేల్చిన అధికారులు... ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో మ‌రో 50 వేల మందిని జాబితా నుంచి తొల‌గించినట్టు తెలుస్తోంది.


More Telugu News