లోకేశ్ కనగరాజ్ జాబితాలో చరణ్ సినిమా!
- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా లోకేశ్ కనగరాజ్
- 'విక్రమ్'తో విపరీతంగా పెరిగిపోయిన క్రేజ్
- రజనీ కూడా ఆసక్తిని చూపుతుండటం విశేషం
- టాలీవుడ్ హీరోల్లో చరణ్ తో లోకేశ్ చేసే ఛాన్స్
ఇప్పుడు కోలీవుడ్లో ఎక్కడ చూసినా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరే వినిపిస్తోంది. 'విక్రమ్' విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆయనను కమల్ ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు నేరుగా అతనిని రజనీకి సిఫార్స్ చేశారు. దాంతో రజనీ కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇక మిగతా స్టార్ హీరోలు కాస్త ఆలస్యమైనా ఫరవాలేదంటూ ఆయన జాబితాలో తమ పేర్లను చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ తెలుగులో ఏ హీరోతో సినిమా చేయవచ్చనే ప్రశ్నకి సమాధానంగా చరణ్ పేరు వినిపిస్తోంది. అందుకు కారణం తాజాగా లోకేశ్ కనగరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూనే.
"నాకు .. చరణ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఏ సమయంలోనైనా ఆయనకి కాల్ చేసి మాట్లాడే చనువు వుంది. మొన్న మెగాస్టార్ ఆతిథ్యం అందుకోవడానికి వెళ్లినప్పుడు చరణ్ లేకపోతే నాకు ఎలాగో అనిపించింది. ఆల్రెడీ చరణ్ కి రెండు కథలను వినిపించాను. తరచూ మేము ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాము" అని లోకేశ్ చెప్పాడు. దాంతో చరణ్ తో లోకేశ్ సినిమా ఉండటం ఖాయమని అంతా అనుకుంటున్నారు.