వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ను కలిసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- ఇటలీ పర్యటనకు వెళ్లిన నవీన్ పట్నాయక్
- రోమ్ లో గాంధీ విగ్రహానికి నివాళులు
- అనంతరం పోప్ తో భేటీ
- ఎంతో సంతోషం కలిగించిందన్న ఒడిశా సీఎం
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఇటలీ పర్యటనకు వెళ్లారు. రోమ్ లో ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. పరమ పవిత్రుడైన పోప్ ను కలవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని నవీన్ పట్నాయక్ తెలిపారు. సాదర స్వాగతం పలికినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. పోప్ కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
అంతకుముందు, నవీన్ పట్నాయక్ రోమ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతిపిత ఆశయాలు, సిద్ధాంతాలే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కాగా, రోమ్ నుంచి తిరిగివచ్చే క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ దుబాయ్ లో మధ్యప్రాచ్యం వ్యాపారవేత్తలతోనూ, స్థానిక పెట్టుబడిదారులతోనూ సమావేశం కానున్నారు.