ఈ నెల 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటించనున్న ప్రధాని మోదీ
- జర్మనీలో జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం
- ప్రధాని మోదీని ఆహ్వానించిన జర్మనీ చాన్సలర్
- వివిధ అంశాలపై ప్రసంగించనున్న మోదీ
- జర్మనీ పర్యటన అనంతరం యూఏఈ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ యాత్రకు వెళ్లనున్నారు. మోదీ ఈ నెల 26, 27 తేదీల్లో జర్మనీలో పర్యటించనున్నారు. స్క్లోస్ ఎల్మావులో జరిగే జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి రావాలంటూ జర్మనీ చాన్సల్ ఓలాఫ్ షోల్జ్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ జీ7 సదస్సులో ప్రధాని మోదీ రెండు సెషన్లకు హాజరవుతారు. పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్యం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రసంగించనున్నారు.
కాగా, జర్మనీ పర్యటన అనంతరం ఈ నెల 28న ప్రధాని మోదీ యూఏఈ వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ మృతి పట్ల మోదీ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేయనున్నారు.
కాగా, జర్మనీ పర్యటన అనంతరం ఈ నెల 28న ప్రధాని మోదీ యూఏఈ వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ మృతి పట్ల మోదీ వ్యక్తిగతంగా సంతాపం తెలియజేయనున్నారు.