ప్రభుత్వం జోక్యం చేసుకునేదాకా తీసుకురావొద్దు... సినీ కార్మికుల సమ్మెపై స్పందించిన తలసాని
- వేతనాలు పెంచాలంటున్న సినీ కార్మికులు
- ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
- ఫిలిం ఫెడరేషన్ ముట్టడి
- చర్చలు జరపాలన్న తలసాని
- ఫిలిం చాంబర్, నిర్మాతల మండలికి సూచన
గత కొన్నాళ్లుగా తమ వేతనాలు పెంచలేదని, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడం తెలిసిందే. దాంతో ఇవాళ సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వివరించారు. తక్షణమే సినీ కార్మిక సంఘాలతో ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తలసాని సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచిచూడొద్దని హితవు పలికారు. సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.