2022 మారుతి విటారా బ్రెజ్జా.. ఊరించే కొత్త ఫీచర్లు ఎన్నో
- 360 డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరా
- క్యాబిన్ లోపల ఇన్ఫోటెయిన్ మెంట్ స్క్రీన్ పై చూడొచ్చు
- సౌకర్యానికి వీలుగా మరింత బ్యాక్ స్పేస్
మారుతి సుజుకీ త్వరలో విడుదల చేయనున్న 2022 మోడల్ విటారా బ్రెజ్జా ఎస్ యూవీలో ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. ఇందులో 360 డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరా కూడా ఒకటి. క్యాబిన్ లోని ఇన్ఫోటెయిన్ మెంట్ స్క్రీన్ లో కెమెరా చూపిస్తున్న చిత్రాలను పరిశీలించొచ్చు.
2016లో తొలిసారి విటారా బ్రెజ్జాను మారుతి సుజుకీ విడుదల చేసినప్పటి నుంచి ఆధునిక ఫీచర్లతో కొత్త కస్టమర్లను చేరుకుంటూనే ఉంది. ఈ విభాగంలో బ్రెజ్జా ఎక్కువగా అమ్ముడు పోతుంటుంది. కాకపోతే క్యాబిన్ లో తక్కువ ఫీచర్లు ఉన్నాయనే విమర్శలను కంపెనీ ఇంతకాలం ఎదుర్కొన్నది. వీటికి చెక్ పెడుతూ 2022 మోడల్ విజాటా బ్రెజ్జాలో మారుతి సుజుకీ కొత్త ఫీచర్లకు చోటిచ్చింది. సౌకర్యానికి పెద్ద పీట వేస్తూనే, 360 డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరాను ఏర్పాటు చేసింది.
ఈ కెమెరా సాయంతో వాహనం నడిపే వ్యక్తి ముందూ వెనుక ఉన్న వాటిని మరింత స్పష్టంగా చూడొచ్చు. చిన్న రోడ్లలో కారు నడిపే వారికి ఇది ఎంతో సౌకర్యాన్ని ఇవ్వనుంది. క్యాబిన్ లోపల యాంబియంట్ లైట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వెనుక భాగంలో మరింత స్పేస్ ఉంటాయి. పెట్రోల్ వెర్షన్ గానే దీన్ని మారుతి విడుదల చేయనుంది.