‘ఈవీట్రిక్ రైజ్’ ఎలక్ట్రిక్ బైక్.. 110 కిలోమీటర్ల రేంజ్
- మార్కెట్లోకి విడుదల చేసిన పూణె సంస్థ
- చార్జింగ్ అయిన వెంటనే ఆటో కటాఫ్ ఫీచర్
- ఎక్స్ షోరూమ్ ధర రూ.1,60,000
పూణెకు చెందిన ఈవీట్రిక్ మోటార్స్.. ఈవీ ట్రిక్ రైజ్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. ఒక్కసారి చార్జింగ్ తో 110 కిలోమీటర్లు ప్రయాణించే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,60,000. ఈ బైక్ బుకింగ్ లను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడం తెలిసిందే. మార్కెట్లో ఎక్కువగా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, బైక్ లు తక్కువే. ఈ క్రమంలో ఈవీ ట్రిక్ మోటార్స్ కమ్యూటింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈవీ బైక్ ను తీసుకొచ్చింది.
2,000 వాట్ బీఎల్డీసీ మోటార్ 70వోల్ట్స్/40యాంపీ హవర్స్ లిథియం అయాన్ బ్యాటరీతో ఈ బైక్ పనిచేస్తుంది. నాలుగు గంటల్లో నూరు శాతం చార్జ్ అవుతుంది. బైక్ తో పాటు వచ్చే మైక్రో చార్జర్.. చార్జింగ్ పూర్తయిన వెంటనే ఆటో కటాఫ్ ఫీచర్ తో ఉంటుంది. 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.