ఏపీలో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలల పునఃప్రారంభం.. కారణమేంటంటే..!
- జులై 4న పునఃప్రారంభం కానున్న పాఠశాలలు
- అదే రోజున రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ
- మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని
- ప్రధాని టూర్ నేపథ్యంలోనే ఒక రోజు ఆలస్యంగా పాఠశాలల పునఃప్రారంభం
ఏపీలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు జులై 4న పునఃప్రారంభం కానున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జులై 4న కాకుండా జులై 5న పాఠశాలలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వెరసి ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయన్న మాట.
పాఠశాలలను ఒక రోజు ఆలస్యంగా తెరిచేందుకు గల కారణాలను కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జులై 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరి పరిధిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలోనే పాఠశాలల పునఃప్రారంభాన్ని ఒక రోజు వాయిదా వేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.